కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం
జిన్నారం ; సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికైన కాట సుధా శ్రీనివాస్ గౌడ్‌ను బొల్లారం డివిజన్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు,పటాన్ చెరు ఆత్మ కమిటీ డైరెక్టర్ పులగూర్ల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. వరుసగా రెండోసారి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె నాయకత్వంలో జిల్లాలో మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధికి, మహిళా సమస్యల పరిష్కారానికి ఆమె మరింత కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.