BREAKING
సంక్రాంతి బరిలో కాకా వర్సెస్ విశ్వంభర క్లాష్.. ఓటీటీ డెడ్‌లైన్ టెన్షన్స్‌లో మెగా మూవీ! జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్' సినిమాపై క్లారిటీ.. ఆ వార్తల్లో నిజమెంత? కుటుంబంతో కలిసి అట్టహాసంగా దిల్ రాజు దీపావళి వేడుకలు.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు! ఆస్కార్ రేసులోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. అకాడమీ అవార్డుల పరిశీలనకు పంపిన మేకర్స్! అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం ప్రశ్నించే గొంతును కట్టడిచేస్తే ప్రతిఘటిస్తాం -కూటమి ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ నేతల హెచ్చరిక అభిమాని కామెంట్‌కు నటి సునైనా ఊహించని రిప్లై.. నెట్టింట వైరల్ అవుతున్న కౌంటర్! మెలియాపుట్టి ఎంపీపీ పీఠం దినకర్‌కేనా? పారదర్శకంగా గుణంకాల నమోదు పాటించాలి -నోడల్ అధికారుల అవగాహనలో ఆప్సి చైర్మన్ ఆచార్య ఎస్.విజయభాస్కర రావు మెలియాపుట్టిలో పది చోట్ల నామినేషన్ కేంద్రాలు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న దిశా పటాని.. వైట్ డ్రస్‌లో స్టన్నింగ్ లుక్స్! 20కి 20 ధ్రువీకరణ పత్రాలు అందుకున్న టీడీపీ ఎంపీటీసీలు ప్రజాక్షేత్రంలో గెలుపు, ఓటములు సహజమే - జడ్పీటీసీ వాసంశెట్టి నాగేశ్వరరావు. అండగా ఉంటామని భరోసా. అంతరాబ, అచ్చుతాపురంలో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం. రేపు శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి హుండీల లెక్కింపు.

టెక్స్ టైల్ పార్క్ భూసేకరణలో అక్రమాలపై విచారణ జరపాలి

Select Suryaa Now
టెక్స్ టైల్ పార్క్ భూసేకరణలో అక్రమాలపై విచారణ జరపాలి

గీసుగొండ , మేజర్ న్యూస్, మండలంలోని శాయంపేట హవేలిలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ భూసేకరణలో జరిగిన అక్రమాలు వెలికితీయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కొంగర రవి కుమార్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి బీఆర్ఎస్ నాయకులు,కొందరు అధికారులు కుమ్మక్కై బినామీ పేర్లతో నష్టపరిహారం పొందడమే కాకుండా, ఆ సొమ్మును వాటాలుగా పంచుకున్నారని,ముఖ్యంగా బోరుబావులు లేని భూముల్లో ప్లాస్టిక్ పైపులు చూపించి, ఫొటోలు తీసి బోరుబావుల పేరుతో నష్టపరిహారం పొందిరని అన్నారు.ఈ వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ నాయకుల పాత్రకూడా ఉందని,మరోవైపు, నిజమైన రైతులు తమ భూములకు సంబంధించిన నష్టపరిహారం కోసం ఏళ్ల తరబడి అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని అన్నారు.అప్పట్లో తెల్లకాగితంపై భూమి వివరాలు రాసిస్తే పరిహారం చెల్లించిన అధికారులు,నేడు అదే రైతులను రకరకాల ఆధారాల పేరుతో ఇవాళ రా రేపు రా అంటూ తిప్పించుకుంటున్నారని,బినామీలకు పరిహారం ఎలా అందింది? నిజమైన రైతులకు ఎందుకు అందడం లేదు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యుల ఆస్తులు, లావాదేవీలను పరిశీలించి, అక్రమంగా చెల్లించిన ప్రజాధనాన్ని తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సంపూర్ణ నమ్మకం ఉందని,ఎందుకంటే మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి లాగా కాదు తమరు ప్రత్యేక చొరవ తీసుకొని, అప్పటి భూసేకరణ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి అధికారి పాత్రపై నిష్పక్షపాత విచారణ జరిపించి జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని కోరారు.అలాగే నష్టపరిహారం అందని అర్హులైన రైతులను గుర్తించి,వారికి రావాల్సిన పరిహారాన్ని తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని,ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు ఎమ్మెల్యే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రిపోర్టర్ ;విష్ణు చందర్, గీసుకొండ, వరంగల్ జిల్లా