BREAKING
దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్

మెలియాపుట్టి ఎంపీపీ పీఠం దినకర్‌కేనా?

Select Suryaa Now
మెలియాపుట్టి ఎంపీపీ పీఠం దినకర్‌కేనా?


వైస్ ఎంపీపీగా సలాన రోహిణి పేరు తెరపైకి
15 ఎంపీటీసీ స్థానాల్లో కూటమికి 12 స్థానాలు

మెలియాపుట్టి. నవంబర్ 10. మేజర్ న్యూస్... మెలియాపుట్టి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎంపీపీ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోనుండగా, అధ్యక్ష పదవికి మర్రిపాడు-సి ఎంపీటీసీగా విజయం సాధించిన బైరసింగి దినకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు ఎంపీపీ బాధ్యతలు అప్పగించాలని కూటమి నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైస్ ఎంపీపీ పదవికి కోసమాల ఎంపీటీసీగా గెలుపొందిన సలాన రోహిణి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మెలియాపుట్టి మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన రెండు స్థానాల్లో విజయం సాధించగా, వైఎస్సార్‌సీపీ మూడు స్థానాలకే పరిమితమైంది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కూటమి బలం 12 స్థానాలకు చేరింది. ఈ ఫలితాలు మండల పరిషత్‌పై కూటమికి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు ఎవరిని వరించనున్నాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పీఏసీఎస్ అధ్యక్షుడు సలాన మోహనరావు కోడలు సలాన రోహిణికి వైస్ ఎంపీపీ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సామాజిక, రాజకీయ సమీకరణాలతో పాటు పార్టీ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పదవుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మండలంలో స్పష్టమైన మెజార్టీ సాధించిన కూటమి నేతలు పదవుల పంపకంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. బైరసింగి దినకర్, సలాన రోహిణి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో మెలియాపుట్టి మండల రాజకీయాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.