BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం

Select Suryaa Now
పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం

విజయవాడ, మేజర్ న్యూస్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందించి వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలాబాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం విజయవాడలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలు, శిక్షణా విధానం, ఇతర వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. పేద విద్యార్థులు, యువత అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా రెసిడెన్షియల్ శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. మరికొందరు అభ్యర్థులకు ట్యాబ్‌లు అందించి ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా, శిక్షణా సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని మంత్రి డోలాబాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.