BREAKING
అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి బిక్కవోలులో జనసేనకు 100 శాతం విజయం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కళ్యాణి ఎంపిక. ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చిట్యాల విద్యార్థులు ఎంపిక కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి కె.గంగవరంలో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు.. మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి

Select Suryaa Now
 భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వేను పరిశీలించి, సర్వేయర్లు, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైతుల సహకారంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలని సూచించారు. అనంతరం వంగరలోని డాక్టర్ పీవీ రంగారావు తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించి భోజన నాణ్యత, వంటగదిలోని సరుకులను తనిఖీ చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సైతం సందర్శించి సదుపాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భూముల కొలతల శాఖ ఏడీ నూర్‌సింగ్, తహసీల్దార్ రాజేష్, ప్రిన్సిపల్ అఫ్రిన్ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ :రామకృష్ణ, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా