BREAKING
అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి బిక్కవోలులో జనసేనకు 100 శాతం విజయం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కళ్యాణి ఎంపిక. ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చిట్యాల విద్యార్థులు ఎంపిక కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి కె.గంగవరంలో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు.. మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి

Select Suryaa Now
అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్:  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో స్థానిక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 19, 20వ తేదీలలో ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించడంతో మండల కేంద్రంలో రాజకీయ సందడి మొదలైంది.

ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన అంబాజీపేట మండల పరిషత్ పీఠాన్ని కూటమి ఒప్పందంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో ఏకంగా 14 స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. ఎంపీపీ అధ్యక్ష పదవి జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వ్ కావడంతో, కొర్లపాటివారిపాలెం ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన టిడిపి సీనియర్ నాయకులు, 007 క్లస్టర్ ఇన్‌ఛార్జి గణపతి వీర రాఘవులు సతీమణి గణపతి అనంతలక్ష్మి తులసి పేరు మండల అధ్యక్ష రేసులో ప్రముఖంగా ముందుకొచ్చింది.

క్షేత్రస్థాయిలో పార్టీకి వీర రాఘవులు అందించిన విశేష సేవలు, ప్రజల్లో ఆయనకున్న పట్టు, నిబద్ధతను పరిగణనలోకి తీసుకున్న కూటమి అగ్ర నాయకత్వం ఆయన సతీమణి అనంతలక్ష్మి తులసికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు కూటమి నాయకత్వం అంగీకారం తెలిపినట్లు తెలిసింది.