రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కళ్యాణి ఎంపిక.
అనపర్తి మేజర్ న్యూస్. అనపర్తి ఓల్డ్ టౌన్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మల్లేశ్వరపు కళ్యాణి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. అండర్–19 బాలికల హైజంప్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. సుజాత, పీడీ కె. శివశంకర్, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్, సభ్యులు కళ్యాణిని అభినందించారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అనపర్తి శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అండర్–17 బాలబాలికల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 280 మంది క్రీడాకారులు, 60 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎంపికైన బాలబాలికల జట్లు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు కోనసీమ జిల్లా నేదునూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాయి. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు.