BREAKING
అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి బిక్కవోలులో జనసేనకు 100 శాతం విజయం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కళ్యాణి ఎంపిక. ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చిట్యాల విద్యార్థులు ఎంపిక కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి కె.గంగవరంలో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు.. మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

Select Suryaa Now
మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

రావులపాలెం: మేజర్ న్యూస్ కాపు సామాజిక వర్గ ఐక్యత, అభ్యున్నతి, హక్కుల సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు మిరియాల వెంకట్రావు అని రాష్ట్ర కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ కొనియాడారు.
మిరియాల వెంకట్రావు 13వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రావులపాలెంలోని శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. సంఘం అధ్యక్షులు నందం వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కాపు జేఏసీ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మిరియాల వెంకట్రావు సేవలు, ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో అరేటి ప్రకాష్, వాసిరెడ్డి ఏసుదాసు, నందం కాశీవిశ్వనాథ్, సిద్ధిరెడ్డి శ్రీనివాస్ తదితర కాపు నాయకులు, యువత పాల్గొన్నారు.