BREAKING
అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి బిక్కవోలులో జనసేనకు 100 శాతం విజయం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కళ్యాణి ఎంపిక. ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చిట్యాల విద్యార్థులు ఎంపిక కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి కె.గంగవరంలో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు.. మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది

Select Suryaa Now
కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది

అయినవిల్లి మేజర్ న్యూస్:భారతదేశ కష్టాల్లో  ఉన్నప్పుడు కరోనా గాని యుద్ధ సమయంలో గానీ దేశంలో  అంతః కలహాల సమయంలో గానీ దేశాన్ని చెక్కుచెదరకుండా రక్షించిన వాడు రైతు  పండించే పంటల వలన ఆహార కొరత లేకుండా దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఆహారాన్ని స్వీకరిస్తున్నారు అటువంటి రైతుకు  ప్రకృతి విపత్తు కన్నీరు పెట్టిస్తుంది గత వారం సంభవించిన వరుస తుఫానులైన ఆర్నా మురసు ప్రభావం కోస్తా జిల్లాలను అతలాకుతలం చేయటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు కొబ్బరి చెట్టు నాటిన నాటినుండి కాయలు కాసే వరకు పెంచాలంటే సుమారు 8 నుండి 10 సంవత్సరాల సుదీర్ఘకాలం పడుతుంది అటువంటి కొబ్బరి చెట్టు ఒక గంటలో కొన్ని నేలకూలి కాయలు రాని దెబ్బతినడంతో రైతులు పరిస్థితి ధైనియంగా మారింది కోనసీమలో ముఖ్యంగా లక్షలాది ఎకరాల్లో కొబ్బరి సాగు వరి సాగు అరటి ఇతర పంటలకు పేరుగాంచినవి గోదావరి కృష్ణా జలాలు ఇక్కడ భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి అన్ని రకాల పంటలు పండి దేశం నలుమూలలకి విదేశాలకు ఇక్కడ నుండి సరఫరా అవుతుంటాయి అటువంటి కోస్తా జిల్లాలు మరియు కోనసీమ ప్రజలు ప్రతి సంవత్సరం తుఫానులను ఎదుర్కొంటుంటారు ఇక్కడి రైతులు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు 1996 నవంబర్ 6న సంభవించిన పెను తుఫాను పెను  విధ్వంసాన్ని సృష్టించింది వేలాదిగా అప్పట్లో ప్రజలు ఇక్కడ చనిపోయారు అప్పటి నుంచి 1926 నవంబర్ మొదటి వారంలో సంభవించిన తుఫాన్ దగ్గర దగ్గరగా అదే విపత్తును కలిగించింది అరటి తోటలు అన్ని విరిగి కొబ్బరి చెట్లు ఆకులు రాలి చెట్లు పడి వ్యవసాయాలు చిo ద్రవందరయ్యాయి వరి పంట పూర్తిగా నేలపాలయ్యింది ప్రకృతి విపత్తులకు తీవ్రంగా బలి అయ్యేది రైతు మాత్రమే కోస్తా జిల్లాల రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆదుకోవాలని రైతులు సంఘాలు కోరుతున్నాయి