రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చిట్యాల విద్యార్థులు ఎంపిక
గోపాలపురం, నవంబరు 10 మేజర్ న్యూస్: గోపాలపురం మండలం చిట్యాల పీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు (ముగ్గురు బాలికలు, 4 గురు బాలురు) రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు.
ఈ నెల 7న నారాయణపురంలో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి పోటీలలో వీరు ప్రతిభ చూపి ఎంపికైనట్లు హెచ్.ఎం వై.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు.
ఎంపికైన బాలికలు: ఎం. వాణి ప్రసాద్, వి. కీర్తి సుధ, సి.హచ్. లోహిత
ఎంపికైన బాలురు: పి. ధనుష్, పి. ఆర్య ఆనంద్, డి. పవన్ కుమార్, కె. ప్రవీణ్ ఈ విద్యార్థులు త్వరలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పీడీ బి. సతీష్ వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన పీడీ సతీష్‌ను ఎస్ఎంసీ చైర్మన్ వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.