బిక్కవోలులో జనసేనకు 100 శాతం విజయం.
ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఐదింటినీ కైవసం చేసుకున్న జనసేన మహిళా అభ్యర్థులు.
బిక్కవోలు మేజర్ న్యూస్.:బిక్కవోలు మండలంలో జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మండల పరిధిలో ఐదు ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులందరూ విజయం సాధించి 100 శాతం ఫలితాన్ని నమోదు చేశారు. ఐదు స్థానాల్లోనూ మహిళా అభ్యర్థులే గెలుపొందడం విశేషం. విజయం సాధించిన వారిలో కాపవరంలో కొట్టు వీరలక్ష్మి, కొమరిపాలెం–1లో కొల్లి వెంకటలక్ష్మి, బలభద్రపురం–3లో ధనకొండ లక్ష్మి, బిక్కవోలు–2లో పాలికి బేబీ, మెల్లూరులో ముమ్మిడి సత్యశ్రీ ఉన్నారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళల సమష్టి కృషికి నిదర్శనమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ విజయానికి పార్టీ సమన్వయకర్త రావాడ నాగు, ఇందల వీరబాబు, గోవిందరాజు, కొండబాబు, సతీష్‌కుమార్, వెంకన్నబాబు, అరుణ్‌కుమార్, హరీష్, శ్రీనివాసు తదితరులు కృషి చేశారు. ఐదు స్థానాల్లోనూ విజయం సాధించడంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.