BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి

Select Suryaa Now
జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి

రామచంద్రపురం మేజర్ న్యూస్ :వచ్చే నెల 12న జరిగే జాతీయలోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రామచంద్రపురం 13వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు జడ్జి బి. హెచ్. వి.లక్ష్మీ కుమారి కోరారు. మంగళవారం జిల్లా కోర్టు 
హాలులో న్యాయవాదులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.

 సమావేశంలో ఆమె మాట్లాడుతూ  రాజీ చేసుకోవడానికి అవకాశం ఉన్న కేసులుకు ప్రతి న్యాయవాది సహకారం అందించాలని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా లభించే ప్రయోజనాలు కక్షిదారులకు చెప్పి వారిని రాజీమార్గం వైపు నడిపించే బాధ్యత న్యాయవాదులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి  ఎం.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటిపల్లి లోవరాజు, ట్రెజరర్ సాధే నారాయణరావు, మహిళా ప్రతినిధి కె. వి. సత్యవాణి, న్యాయవాదులు    పలివెల సత్యనారాయణ, దొమ్మలపాటి సత్యనారాయణ, గాలింకి చిట్టిబాబు, పిల్లా పృథ్వి రామయ్య,  కటకం అబ్బురామ్,పి.భరత్ బాబు,పంపన విటల్,బొడ్డపాటి సురేష్ కుమార్, ఎస్. బి. ఎస్ కుమారస్వామి,సూరంపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు