BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక

Select Suryaa Now
ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక

విజయవాడ మేజర్ న్యూస్ : పురుషులు, మహిళల ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపికలు ఈ నెల 12వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి నాగం సతీష్ బాబు తెలిపారు. పైపుల రోడ్ జంక్షన్ సమీపంలోని ఎస్. కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 4 గంటల నుంచి ఎంపికల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 31 నాటికి లేదా అంతకుముందు 13 ఏళ్ల వయస్సు పూర్తిచేసుకున్న ఫెన్సింగ్ క్రీడాకారులు అర్హులని తెలిపారు. ఫెన్సింగ్ కత్తులతో ఆడే క్రీడ కావడంతో, ఇప్పటివరకు ఈ ఆటలో పాల్గొనని క్రీడాకారులు గుర్తింపు పొందిన ఫెన్సింగ్ శిక్షకుడి వద్ద కనీసం ఆరు నెలలు శిక్షణ పొంది ఉండాలని సూచించారు. శిక్షణ ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరుకావాలని కోరారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 15న కాకినాడలోని లక్ష్య స్కూల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన వారు నవంబర్ 27 నుంచి పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని గురునానక్ విశ్వవిద్యాలయం ఇండోర్ స్టేడియంలో జరిగే జాతీయ సీనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9553528888 నంబర్‌లో సంప్రదించాలని నాగం సతీష్ బాబు సూచించారు.          

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.