BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు

Select Suryaa Now
అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. -  మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు

విజయవాడ మేజర్ న్యూస్ : అంతర్జాతీయ చెస్ పోటీల్లో వరుస విజయాలతో దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చిన గ్రాండ్‌మాస్టర్ ముసలప్పగారి రాహుల్ లలిత్ బాబును రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. మంగళవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో లలిత్ బాబు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, తాను సాధించిన ట్రోఫీలను చూపించి విజయాల వివరాలను వెల్లడించారు. జర్మనీలో జరిగిన 43వ మున్‌స్టర్‌ల్యాండ్ చెస్ ఓపెన్, స్పెయిన్‌లో జరిగిన బెనిడోర్మ్ చెస్ ఓపెన్–2026 టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలిచినట్లు తెలిపారు. రెండు టోర్నీల చివరి రౌండ్లలో అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్లపై నల్ల పావులతో ఆడి విజయాలు సాధించిన విషయాన్ని వివరించారు. లలిత్ బాబు విజయాలపై మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సత్కరించారు. క్రీడారంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని, ప్రపంచ అగ్రశ్రేణి ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించాలనే ఆయన లక్ష్యానికి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు.  

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.