BREAKING
భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

Select Suryaa Now
యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

గోపాలపురం,  (మేజర్ న్యూస్):మొరసు తుపాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న కరిచర్లగూడెం–సంజీవపురం రహదారిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం గోపాలపురం మండలంలో ఈ రహదారిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

భారీ వర్షాలు, వరద ప్రవాహం వల్ల సుమారు 320 మీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైందని, మరో 700 మీటర్ల మేర విరిగి ఒకవైపునకు ఒరిగి కుంగిపోయిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దెబ్బతిన్న రహదారిపై ప్రయాణించే ప్రజలు, వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి పునరుద్ధరణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయం

గండి పడిన ప్రాంతంలో వరద ప్రవాహానికి అనుగుణంగా పైప్‌లైన్లు ఏర్పాటు చేసి, నీటిని సక్రమంగా మళ్లించేలా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతు, పునర్నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖ చేపట్టాలని ఆదేశించారు. రెండు శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనులను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ బాలకృష్ణతో కలెక్టర్ మాట్లాడి, రహదారికి జరిగిన నష్టం, చేపట్టిన తాత్కాలిక మరమ్మతులు, పూర్తిస్థాయి పునరుద్ధరణకు అవసరమైన చర్యల వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

పంట నష్టం లెక్కింపు కొనసాగుతోంది

గత మూడు రోజులుగా గోపాలపురం మండలంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించినట్లు కలెక్టర్ తెలిపారు. కేవలం ఐదు గంటల వ్యవధిలో దాదాపు 60 మిల్లీమీటర్ల వర్షం కురవడం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో పలు చెరువులకు గండ్లు పడి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బలమైన ఈదురు గాలులు, వర్షాల వల్ల ముఖ్యంగా వరి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ప్రస్తుతం పంట నష్టం లెక్కింపు (క్రాప్ ఎన్యూమరేషన్) ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర అంతర్-మంత్రిత్వ బృందాన్ని పంపాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆ బృందం త్వరలో ఇక్కడి ముంపు ప్రాంతాలను పర్యటించి, పంట నష్టాన్ని అంచన వేసి బాధితులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు.

తుపానుతో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను త్వరితగతిన పునరుద్ధరించి, ప్రజలకు సాధారణ రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.