BREAKING
అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి బిక్కవోలులో జనసేనకు 100 శాతం విజయం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కళ్యాణి ఎంపిక. ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చిట్యాల విద్యార్థులు ఎంపిక కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి కె.గంగవరంలో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు.. మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి

Select Suryaa Now
ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి

                                     ఎల్ఐసీ రంగంలో ప్రతిభ చాటిన కొమరిపాలెం యువకుడు.

 బిక్కవోలు మేజర్ న్యూస్.కృషి, పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కొమరిపాలెం గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ కర్రీ అజయ్ రెడ్డి నిరూపించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన ఆయన ప్రతిష్టాత్మకమైన మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ (ఎం.డి.ఆర్.టి.) అర్హత సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. రామచంద్రపురం ఎల్ఐసీ బ్రాంచ్ పరిధిలో మొదటి స్థానాన్ని సాధించడం విశేషం.ఎల్ఐసీ ఏజెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే తనదైన శైలిలో సేవలందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బీమా పాలసీల ప్రాముఖ్యత, వాటి ద్వారా లభించే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. చిన్నారులు, మహిళలు, రైతులు, వ్యాపారస్తుల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వివిధ బీమా పథకాల గురించి సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ పలువురికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు.కేవలం పాలసీల విక్రయానికే పరిమితం కాకుండా, ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు బీమా పట్ల అవగాహన కల్పిస్తూ, అధిక సంఖ్యలో పాలసీదారులను ఎల్ఐసీ పరిధిలోకి తీసుకురావడంలో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించి బ్రాంచ్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఆయన కృషికి నిదర్శనంగా నిలిచింది.ఈ సందర్భంగా రామచంద్రపురం ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ చిట్టిబాబు, అసిస్టెంట్ మేనేజర్ జగన్మోహన్ రావు, డెవలప్‌మెంట్ ఆఫీసర్ కర్రీ వెంకట్ రెడ్డి, ఎల్ఐసీ సిబ్బంది, గ్రామ ప్రజలు కర్రీ అజయ్ రెడ్డిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించి ఎల్ఐసీ సంస్థకు, కొమరిపాలెం గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.