BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి... - ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి - గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి - ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్

Select Suryaa Now
ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి...  - ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి  - గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి  -  ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి...

- ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి

- గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి 
-  ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్

సూర్య - పెద్దపల్లి రూరల్ : ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా ఇంటింటా ఇంకుడు
గుంతల నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు.
మంగళవారం పెద్దపల్లి ఎంపీడీవో ఆధ్వర్యంలో సర్పంచులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో మండలంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదికలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల వారీగా నీటి ప్రభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, జలసిరి, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణ పనుల పురోగతిపై వివరించారు.
వీబీ-జీ రామ్-జీ పథకం కింద చేపట్టాల్సిన పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని, కూలీల సంఖ్యను పెంచి రోజుకు కనీసం 50 మంది ఉపాధి కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల వారీగా పనుల జాబితాను (షెల్ఫ్ ఆఫ్ వర్క్స్) సిద్ధం చేసి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రతి గ్రామంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు, సోక్‌పిట్‌ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో  ఏపీవో రమేష్ బాబు, మిషన్ భగీరథ ఇంట్రా డి ఈ సతీష్, గ్రిడ్ డి ఈ అనిల్,  గ్రిడ్ ఏఈ రాము, . ఇంట్రా ఏ ఈ అభిషేక్ పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, జేఈలు, ఎఫ్‌ఏలు, మేట్లు తదితరులు పాల్గొన్నారు.