BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Select Suryaa Now
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ :రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు  త్వరలోనే ఇళ్ల స్థలాలను  అందించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు. బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రిని కలిసి, ఇటీవల జరిగిన తమ సంఘ రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలతో కూడిన వినతి పత్రాన్ని అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు చేసిన సానుకూల ప్రకటనపై తమ సంఘ కార్యవర్గ సమావేశం కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఈ ప్రక్రియను వేగవంతం చేసి జర్నలిస్టుల్లో నెలకొన్న ఆందోళనకు తెరదించాలని

ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినట్లు విరాహత్ అలీ, రాంనారాయణలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే  మరో ప్రధాన సమస్య అయిన ఆరోగ్య పథకాన్ని  అమలు చేసి, జర్నలిస్టుల ప్రాణాలకు ప్రభుత్వం భద్రతా కల్పించాలని తమ సంఘం చేసిన తీర్మానాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ ముందుగా హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలోనే ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు చేపడతామని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్ లు ఉన్నారు.