దళితులకు పదవులు కేటాయించే వరకు ఉద్యమిస్తాం -దళిత సంఘాల హెచ్చరిక
దళితులకు పదవులు కేటాయించే వరకు ఉద్యమిస్తాం
-దళిత సంఘాల హెచ్చరిక
ఆమనగల్లు రంగారెడ్డి:
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దళితులకు కేటాయించాలని, లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మండల స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పదవులు కేటాయించే వరకు ఉద్యమిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పూలే అంబేద్కర్ జ్ఞాన జాతర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూఆమనగల్లు మార్కెట్ చైర్మన్ పదవి దళితలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దళితులను వివిధ పార్టీలలో ఉండే అగ్రవర్ణాలనాయకులు ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నారని మండిపడ్డారు. అగ్రవర్ణాలకు సంబంధించినపంచాయతీలు ఉంటే దళితులను ముందు వరుసలో ఉంచి వారి సమస్యలను తీర్చుకుంటున్నారే తప్ప వారికి చేసింది ఏమీ లేదని వారు విమర్శించారు. ఏనాడు ఏ ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతికి కృషి చేయలేదని, ఇప్పటికైనా ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న దళిత నాయకుడు వసుప్పుల జంగయ్యకు కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో మెజారిటీ డైరెక్టర్ పదవులుదళితులకు కేటాయించాలని కోరారు. దళితుల అభ్యున్నతి కోసం అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పదవులు కేటాయించి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని కోరారు. లేని పక్షంలో దళితులు, దళిత సంఘాలు ఏకమై మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పదవులు కేటాయించే వరకు ఉద్యమిస్తామనిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు చింతలపల్లి సర్పంచ్ కొప్పు యాదయ్య, నాయకులు వసపుల సాయిలు, కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గొరిగె వెంకటయ్య, పులికంటి మైసయ్య, డొక్కా పురుషోతం, కాలూరి రామ్ చందర్, గండికోట నర్సింహా, ఒగ్గు శ్రీను, కంబాల పల్లిఅల్లాజీ, బావండ్లపల్లి అశోక్, నిరంజన్ తదితరులు ఉన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.