BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు!

Select Suryaa Now
'పరిషత్'  పీఠాలపై పరోక్ష పోరు!

 

*19, 20 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు

*ముందుగా కోఆప్టెడ్ సభ్యుల ఎంపిక

*ఆ తర్వాత పీఠాల కోసం చేతులెత్తే ఓటింగ్

*కోరం నుంచి ఎక్స్‌అఫీషియో సభ్యుల వరకు కీలకమే!

(విజయనగరం బ్యూరో, మేజర్ న్యూస్)

స్థానిక సంస్థల ఎన్నికల సందడి ముగిసినా.. అసలు రాజకీయ సమరం ఇప్పుడే మొదలుకానుంది. ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల చేతుల్లోకి కీలక నిర్ణయాధికారం చేరడంతో మండల, జిల్లా పరిషత్ పీఠాలపై రాజకీయ పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నెల 19, 20 తేదీల్లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల పరోక్ష ఎన్నికలు జిల్లాలో రాజకీయ ఉత్కంఠను మరింత పెంచనున్నాయి. ఎన్నికల్లో సంఖ్యాబలం సాధించిన పార్టీలు పీఠాలను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తుండగా, హంగ్ ఏర్పడిన మండలాల్లో స్వతంత్రులు, రెబల్స్, ఇతర పార్టీల మద్దతు కీలకం కానుంది. ఇప్పటికే కొన్ని చోట్ల రాజకీయ సమీకరణాలు, మద్దతు కూడగట్టే ప్రయత్నాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమవుతోంది.

ముందు కోఆప్టెడ్.. తర్వాత పీఠాల ఎన్నిక!
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముందుగా కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోనున్నారు. అనంతరం ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. సభ్యులు చేతులెత్తే విధానంలో ఓటు వేయాల్సి ఉండటంతో ప్రతి సభ్యుడి హాజరు, మద్దతు రాజకీయ పార్టీలకు అత్యంత కీలకం కానుంది. ఈ నెల 19న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు, 20న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండు రోజుల్లోనూ ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలన, ఒంటి గంటలోపు ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసి.. ఒంటి గంటకు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన పీఠాల ఎన్నిక చేపట్టనున్నారు.

కోరం ఉంటేనే ఎన్నికల ప్రక్రియ!
ఈ ఎన్నికల్లో కోరం అంశం కూడా కీలకంగా మారనుంది. గెలుపొందిన సభ్యుల్లో సగం మంది హాజరైతేనే సమావేశానికి కోరం ఉన్నట్లుగా పరిగణిస్తారు. నిర్ణీత సమయానికి కోరం లేకపోతే గంటసేపు వేచి చూసి, అప్పటికీ సభ్యుల సంఖ్య సరిపోకుంటే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. మరుసటి రోజు కూడా నిర్వహణ సాధ్యం కాకపోతే తదుపరి తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఇక ఎంపీ, ఎమ్మెల్యే, సంబంధిత మండలంలో ఓటు హక్కు కలిగిన ఎమ్మెల్సీలు నిబంధనల మేరకు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చు. దీంతో ఎన్నికల సమావేశాల్లో వీరి పాత్ర కూడా ప్రాధాన్యం సంతరించుకోనుంది.

అధికార యంత్రాంగం అప్రమత్తం

మరోవైపు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ నెల 14వ తేదీలోగా ఎన్నికల సమావేశాల నోటీసులు అందించాలని సూచించారు. మొత్తానికి ఎన్నికల ఫలితాలతో ముగిసిందనుకున్న పరిషత్ రాజకీయాలు ఇప్పుడు అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాల చుట్టూ కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. సంఖ్యాబలం ఉన్న చోట ధీమా కనిపిస్తుండగా, హంగ్ ఏర్పడిన చోట ప్రతి సభ్యుడి మద్దతు కీలకంగా మారనుంది. ఈ నెల 19, 20 తేదీల్లో జరిగే పరోక్ష ఎన్నికలతో పరిషత్ పీఠాలపై ఎవరి జెండా ఎగురుతుందో తేలనుంది.