ముమ్మన వెంకట రుత్విక్ కు చెస్ లో ఫిడే మాస్టర్ హోదా
విశాఖపట్నం/విజయనగరం నవంబర్ 12 మేజర్ న్యూస్....
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ చెస్ ప్రతిభావంతుడు. ముమ్మన వెంకట రుత్విక్ కు ప్రతిష్ఠాత్మక ఫిడే మాస్టర్ హోదాను సాధించి, తన చెస్ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో అక్టోబర్‌లో జరిగిన వారం రోజుల అంతర్జాతీయ ఐ ఎం చెస్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, ఈ ఘనతను సాధించాడు.
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్లలో రుత్విక్ తన ప్రతిభను నిరంతరం చాటుకుంటున్నాడు. పలు రాష్ట్రస్థాయి ఓపెన్, వయో విభాగాల ఛాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలవడంతో పాటు, అనేక జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించి టాప్ 5, టాప్ 10 స్థానాలను సాధించాడు.
2024 జనవరిలో విశాఖపట్నంలో నిర్వహించిన 2వ శ్రీ చెస్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫిడే రేటెడ్ ఛాంపియన్‌షిప్‌లో ఆరు దేశాలకు చెందిన 464 మంది క్రీడాకారుల మధ్య ఛాంపియన్‌గా నిలవడం రుత్విక్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన ఘట్టం.
అలాగే, 2022లో ప్రతిష్ఠాత్మక కెఐఐటి ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్‌లో పాల్గొని ఒకే టోర్నమెంట్‌లో ఏకంగా 189 ఫిడే రేటింగ్ పాయింట్లను సాధించడం అతని ప్రతిభకు నిదర్శనం.
ఇటీవల హంగేరీలో జరిగిన అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా రుత్విక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుడాపెస్ట్‌లో జరిగిన ఫస్ట్ సాటర్డే ఐ ఎం - ఏ టోర్నమెంట్‌లో ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో ఇంటర్నేషనల్ మాస్టర్స్ రఫత్ ఇస్సా, అట్టిలా టుర్జోతో పాటు గ్రాండ్‌మాస్టర్లు లాయోష్ షెరెష్, డేవిడ్ బెర్జెస్‌లపై అద్భుతమైన డ్రాలు సాధించాడు.
మొత్తం 9 రౌండ్లలో 5.5 పాయింట్లు సాధించి టోర్నమెంట్‌లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు సుమారు 69 FIDE రేటింగ్ పాయింట్లను పెంచుకున్నాడు. అనుభవజ్ఞులైన ఐఎం లు, జిఎం లతో పోటీపడి నిలకడైన ఫలితాలు సాధించడం అతని ఆటతీరులో పెరుగుతున్న పరిణతికి నిదర్శనం.
గత ఏడాది కాలంగా రుత్విక్, సీనియర్ చెస్ కోచ్, ఎం. లోకేశ్వర రావు వద్ద అడ్వాన్స్‌డ్ చెస్ శిక్షణ పొందుతున్నాడుఅతని చెస్ ప్రయాణానికి తొలి పునాది స్థానిక కోచ్ జి. చిరంజీవి మరియు బి. రమణ బాబు వేశారు.
రుత్విక్ తల్లిదండ్రులు ముమ్మన రాజేష్, చంద్రకళ అతని విజయాల వెనుక నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
అతను 2025లో 'కాండిడేట్ మాస్టర్'గా, ఇప్పుడు 2026 లో ఫిడే మాస్టర్ హోదా సాధించడంతో రుత్విక్ తన ఖాతాలో మరో అరుదైన విజయాన్ని జోడించుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధిస్తూ ఉన్నతమైన చెస్ లక్ష్యాలను చేరుకోవాలని, భవిష్యత్తులో ఐ ఎం, జిఎం అయ్యి మన విశాఖ కి మంచి పేరు తీసుకురావాలని ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్త పరిచారు.
డాక్టర్. ఆర్. బాబూరావు, అధ్యక్షులు ఏవిసిఏ.
ఎస్. మణికంఠ రావు, ఎఫ్ఏ, కార్యదర్శి, ఏవిసిఏ.
ఉమామహేశ్వర రావు, ఎఫ్ఏ, కోశాధికారి, ఏవిసిఏ.
వి. శ్రీకాంత్, ఎఫ్ఏ, సి ఏ ఓ, ఏవిసిఏ.
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు