BREAKING
నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం

హదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి....

Select Suryaa Now
హదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి....


*- విజయనగరం జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్ 
విజయనగరం మేజర్ న్యూస్:
విజయనగరం పట్టణంలో రహదారి ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారని జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్  తెలిపారు.

విజయనగరం ట్రాఫిక్ సీఐ ఎ.రాము ఆధ్వర్యంలో 2(ఎ) గర్ల్స్ బెటాలియన్ ఎన్‌సీసీ, దాసన్నపేటకు చెందిన విద్యార్థులు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది కలిసి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సీతం కళాశాల, సత్య డిగ్రీ కళాశాల, ఎం.ఆర్. (ఎ) కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొని బాలాజీ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, ఆర్టీసీ ఇన్ గేట్, ఆర్టీసీ అవుట్ గేట్, మయూరి జంక్షన్, ఓవర్ బ్రిడ్జి ప్రాంతాల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వాహనదారులకు అవగాహన కల్పించిన ముఖ్యమైన అంశాలు:
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలి.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి.
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.
వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వినియోగించకూడదు.
ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
పాదచారులు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

రోడ్డు ప్రమాదాల నివారణ పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. కావున, ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్  వాహనదారులను కోరారు.