గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :
తె ర్లాం నవంబరు 12 మేజర్ న్యూస్ : ఈనెల 14వ తేదీ నుంచి జరుగునున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని గ్రంథాల అధికారి సిహెచ్ కృష్ణమూర్తి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు గురువారం మండల రెవెన్యూ తాసిల్దార్ ఆర్.ధనం వారికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన గ్రంథాలయ వారోత్సవ ప్రారంభ వేడుకల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ వేడుకల్లో మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ముఖ్యంగా యువత భాగస్వాములై ఈ ఏడు రోజులపాటు జరుగు కార్యక్రమాలను విజయవంతంగా జరిగేలా సహకరించాలని ఆయన కోరారు ముఖ్యంగా ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొని గోడపత్రికలో ఏర్పాటుచేసిన తేదీలలో జరుగు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు జరిగే వరకు అధికారులు అనధికారులు మా ఆహ్వానం మన్నించి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.