BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

Select Suryaa Now
19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

 

నెల్లిమర్ల, నవంబరు 22;

​నెల్లిమర్ల మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది.  ఈనెల 19న నూతన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆర్వోఓ మురళీ మోహన్ వెల్లడించారు. 
​ఎన్నిక పారదర్శకంగా జరిగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ అధ్యక్ఞ, ఉపాధ్యక్ష ఎన్నికను పూర్తిగా చేతులెత్తే పద్ధతి ద్వారానే నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
​ఎన్నికల సమావేశాలకు హాజరు కావాల్సిందిగా గెలుపొందిన ఎంపీటీసీ, సభ్యులందరికీ 14వలోగా లేదా అంతకంటే ముందుగానే నోటీసులు అందజేస్తారని చెప్పారు. 19న నిర్వహించే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు లేదా ఫారం A, B లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ల పరిశీలన పూర్తి చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు.