BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు

Select Suryaa Now
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు


రాజాం,నవంబర్ 12,మేజర్ న్యూస్ :
రాజాం పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో  రాజాం పురపాలక సంఘం పరిధిలోని డోలపేటను గురువారం చీపురుపల్లి డిఎస్పి ఎస్ రాఘవులు సందర్శించారు.ఈ సందర్బంగా స్థానిక ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే పురపాలక సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  గూర్చి ప్రజల్లో అవగాహన కల్పించారు.రానున్న ఎన్నికలు ప్రశాంతంగా,సజావుగా జరుగుటకు ప్రజలు పోలీసులకు సహకరించాలని,ఈ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా,స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ,ఎన్నికల్లో డబ్బు,మద్యం పంపిణీ వంటి అక్రమాలకు పాల్పడగూడదని ఆలా పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు,రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేయవద్దు అని,పోలింగ్ నాడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని వెంటనే తమ ఇండ్లకు వెళ్లిపోవాలని,ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన రాదని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రాజాం పట్టణ సీఐ డి నవీన్ కుమార్,ఎస్ఐ మహమ్మద్ సల్మాన్ బేగ్, వార్డ్ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.