BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

అభాగ్యులకు అండగా సేవా సంస్థలు!

Select Suryaa Now
అభాగ్యులకు అండగా సేవా సంస్థలు!

 

బాడంగి, నవంబరు 12 (మేజర్ న్యూస్):
నిరుపేదలకు అండగా నిలవడంతోపాటు విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందించడమే లక్ష్యంగా మూడు సేవా సంస్థలు సంయుక్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. అభ్యుదయ సేవా సంస్థ, సహాయ స్ఫూర్తి ఫౌండేషన్‌, అమ్మ సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం బాడంగి గ్రంథాలయం వేదికగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన ఓ దివ్యాంగుడికి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా వీల్‌చైర్‌ను అందజేశారు. జీవనోపాధికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో ఇద్దరు నిరుపేద మహిళలకు కుట్టుమిషన్‌, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే గ్రంథాలయానికి వచ్చి చదువుకునే విద్యార్థుల అభ్యసనానికి ఉపయోగపడేలా 70 నోటుపుస్తకాలను గ్రంథాలయాధికారికి అందజేశారు. మరో నిరుపేద పాఠశాల విద్యార్థినికి పాఠశాలకు వెళ్లేందుకు వీలుగా సైకిల్‌ను బహూకరించారు.
ఆపన్నులకు చేయూతనందించడం, విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో సేవాభావాన్ని పెంపొందించవచ్చని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్‌ చింత శారద, సహాయ స్ఫూర్తి ఫౌండేషన్‌ అధ్యక్షుడు సాయికుమార్‌, అమ్మ సేవా ఫౌండేషన్‌ అధ్యక్షుడు సురేష్‌, గ్రంథాలయాధికారి దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.