వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు
రామభద్రపురం,నవంబర్12.. మేజర్.న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు కృషి చేయడంతో ఆకర్షితులైన స్థానిక మేజర్ పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు ఎరుసు సత్యారావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామక్రిష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ మేరకు గురువారం ఉదయం స్థానిక మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చింతల రామక్రిష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రామక్రిష్ణ మాట్లాడుతూ గత పాలకులను నమ్ముకొని వైకాపాలో కొనసాగిన సరైన గుర్తింపు రాలేదని,తమ కులం ఓట్లతో గెలుపొందిన వారికి సరైన న్యాయం చేయలేదని,ఇక ముందు ప్రభుత్వ పధకాలను అర్హులైన వారికి అందిస్తూ,వారి వీధుల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.వారి కుల సమస్యలపై కూడా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యుడు యమ్పీటీసి ప్రతినిధి తూముల గోపాలక్రిష్ణ,ఎరుసు విజయానందరెడ్డి,ఎరుసు కన్నారావు,ఎరుసు జగది,ఎరుసు రామక్రిష్ణ,కంబాపు కన్నారావు తదితరులు పాల్గొన్నారు.