BREAKING
ఎన్విడియా తదుపరి సీఈఓగా రెనే హాస్? జెన్సెన్ హువాంగ్ వారసుడిపై టెక్ దిగ్గజం కసరత్తు టీయూడబ్ల్యూజె – ఐజెయు కమిటీలో లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్‌కు కీలక పదవులు ! సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం

ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దుతో విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు: ఏఐవైఎఫ్ నేత కల్లూరు ధర్మేంద్ర

Select Suryaa Now
ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దుతో విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు: ఏఐవైఎఫ్ నేత కల్లూరు ధర్మేంద్ర

                              విలీనాల పేరుతో ప్రభుత్వ విద్యను బలహీనపరచొద్దు..

హైదరాబాద్‌, మేజర్ న్యూస్ ప్రతినిధి : తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యాశాఖ లో విలీనం చేసి 10+2 విధానాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. ఇంటర్‌లోని ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల ప్రత్యేకత, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక బోధనపై స్పష్టత లేదన్నారు. వ్యవస్థలో మార్పుల ఇంటర్‌లోని ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల ప్రత్యేకత, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక బోధనపై స్పష్టత లేదన్నారు. 
వ్యవస్థలో మార్పుల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల మనుగడ, అధ్యాపకులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకం గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనంతో గ్రామీణ విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ముఖ్యంగా బాలికలు, పేద, దళిత, గిరిజన విద్యార్థులకు ఇబ్బందులు పెరుగుతాయని పేర్కొన్నారు. పేదరికం, హాస్టళ్ల కొరత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వంటి సమస్యలను పరిష్కరించకుండా విలీనాలతో డ్రాపౌట్లను తగ్గించలేరన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇంటర్ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, కళాశాలల యాజమాన్యాలతో విస్తృత చర్చ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కల్లూరు ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల మనుగడ, అధ్యాపకులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనంతో గ్రామీణ విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ముఖ్యంగా బాలికలు, పేద, దళిత, గిరిజన విద్యార్థులకు ఇబ్బందులు పెరుగుతాయని పేర్కొన్నారు. పేదరికం, హాస్టళ్ల కొరత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వంటి సమస్యలను పరిష్కరించకుండా విలీనాలతో డ్రాపౌట్లను తగ్గించలేరన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇంటర్ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, కళాశాలల యాజమాన్యాలతో విస్తృత చర్చ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కల్లూరు ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.