BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి

Select Suryaa Now
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి

దుబ్బాక ..ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని వృధాను అరికట్టాలని దుబ్బాక పురపాలిక కమిషనర్ ఎ.మహేష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం దుబ్బాక పురపాలికలోని చేల్లాపూర్ పరిధిలో గల రెండు, మూడు వార్డుల్లో పురపాలిక ఆధ్వర్యంలో ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో కలిగే ఇబ్బందులు, ముందస్తు జాగ్రత్తలు, నీటి, విద్యుత్ వృధా వంటి పలు అంశాలపై ఆయా వార్డుల కౌన్సిలర్లు కనకరాజు, ఎల్లవ్వ తో కలిసి ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పలుచోట్ల వృధాగా పోతున్న మిషన్ భగీరథ నల్లాల వద్ద అప్పటికప్పుడు డమ్మీలను ఏర్పాటు చేసి, నీటి వృధాను అరికట్టారు. వార్డుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్ల వద్ద నీటి లీకేజీలను అరికట్టాలని, నీటిని వృధా చేస్తే రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా, తడి, పొడి చెత్త రూపంలో వేరుచేసి, పారిశుధ్య సిబ్బందికి అందించాలని కోరారు. త్వరలోనే వార్డుల్లో అవసరమున్న చోట్ల డ్రైనేజీలు కల్వర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పురపాలిక మేనేజర్ శ్రీనివాస్, పుర సిబ్బంది దిలీప్, అనిల్, రాజశేఖర్, మెప్మా ఆర్పీలు  తదితరులు పాల్గొన్నారు.