ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ముల్కనూర్‌లోని ఎస్‌ఆర్‌కే పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పాఠశాల చైర్మన్ కాశిరెడ్డి ఆదిరెడ్డి, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలు, నృత్యాలు, వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేసి, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కూన రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్; రామకృష్ణ, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా