అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సౌత్ జోన్ విద్యార్థి పరిశోధన సదస్సు (దక్షిణ మండలం) అన్వేషణ - 2026లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం చరిత్ర సృష్టించి అగ్రస్థానం స్థానంలో నిలిచింది. వర్సిటీ కల్చరల్ అఫైర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ పత్తిపాటి వివేక్ ఆధ్వర్యంలోని ఎస్వీయూ విద్యార్థుల బృందం ఈ కార్యక్రమంలో మూడు బహుమతులు గెలుచుకుని దక్షిణ మండల విశ్వవిద్యాలయాలలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా వర్సిటీ ఉప కులపతి డా నర్సింగరావు, రెక్టార్ ఆచార్య చండ్రాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, కల్చరల్ అఫైర్స్ డైరెక్టర్ ఆచార్య మురళీధర్ విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ అన్వేషణ పోటీలో హిమాకర్, మధుసూదన్, వెంకట మౌనిషాల బృందం ప్రాథమిక సైన్స్ విభాగం నందు స్కేర్ క్రో 2.0 అనే అంశంపై, శాలిని, సమీరాలు ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగం నందు మహిళల భద్రత (స్మార్ట్వచ్)పై, సానియా బాయి సాంఘిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలలో తమ సత్తా చాటి విజయం సాధించారు. కాగా ఎస్వీయూ చరిత్రలో పరిశోధన సదస్సులలో ఆగ్రస్థానంలో నిలవడం ఇదే ప్రథమంగా వర్సిటీలో అధికారులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్