BREAKING
ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం

బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం

Select Suryaa Now
బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం

గణపురం, మేజర్ న్యూస్, బాలల సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ తరఫున ప్రత్యేక కృషి చేస్తామని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం గణపురం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బాలల ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ పాల్గొని బాలల దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. నేటి బాలలే రేపటి సమాజానికి మార్గదర్శకులని, ప్రతి బాలుడు విద్యతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. పిల్లలు తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధుల దృష్టికి ధైర్యంగా తీసుకురావాలని కోరారు. బాలల సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలలతో వారి సమస్యలు, అవసరాలపై ప్రత్యేకంగా చర్చించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పిల్లలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు గ్రామపంచాయతీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉమ్మల్ల విజేందర్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; ఎల్లయ్య, గణపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా