BREAKING
లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి

ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు

Select Suryaa Now
ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు

ధర్మసాగర్, మేజర్ న్యూస్, భారత తొలి ప్రధానమంత్రి చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలను  నిర్వహించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో శనివారం చాచా నెహ్రూ విగ్రహానికి పూలమాలు వేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధర్మసాగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాంబరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏరియా ముఖ్య పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో గాంధీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన చాచా నెహ్రూ మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని అత్యంత స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నించారని అన్నారు. నెహ్రూ కు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని అందుకోసమే బాలల దినోత్సవం గా నవంబర్ 14వ తేదీని దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. ధర్మసాగర్ ప్రభుత్వ పాఠశాల చెందిన 50 మంది విద్యార్థులతో పాటు గ్రామంలోని ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని చాచా నెహ్రూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూనూరు రాజు, మాజీ ఎంపీటీసీ రొండి రాజు, వార్డు సభ్యులు గంగారపు శ్యామ్, బొడ్డు రవి ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; పద్మయ్య, ధర్మాసాగర్, హనుమకొండ జిల్లా