BREAKING
లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి

కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

లింగాలఘణపూర్, మేజర్ న్యూస్, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కుందారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసభ ఏర్పాటు చేసి, స్థానిక చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో సర్పంచ్ కుకట్ల రాజు యాదవ్ వాలీబాల్, క్రికెట్ కిట్‌లను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే సంపూర్ణ వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యమత్యం అలవడతాయని, గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సజ్జన ఉదయ్, గ్రామ కార్యదర్శి బర్ల మధు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ :కార్తీక్, లింగాల గణపురం, జనగామ జిల్లా