BREAKING
లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి

ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు

Select Suryaa Now
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: తిరుచానూరు శాఖ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. వారోత్సవాల సందర్భంగా నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు ఆటల పాటల పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. గెలుపొందిన విద్యార్థులకు 20వ తేదీన జరిగే ముగింపు వేడుకలో బహుమతులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిణి ఏ.శ్రీముఖి మాట్లాడుతూ "విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, పుర ప్రజలందరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ప్రత్యేకంగా తెప్పించాం, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, పాఠకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్