నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి
తిరుపతి మేజర్ న్యూస్ :
తిరుపతి నగరంలోని పలువురు నాయీ బ్రాహ్మణులు తమకు ఇంటి స్థలాలు ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివంను కలసి వినతి పత్రం అందజేశారు. చంద్రశేఖర్ రెడ్డి కాలనీలోని నాయీ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం చైర్మన్ ను పలువురు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో తమకు ఇంటి స్థలం ఇప్పించి ఆదుకోవాలని ఆయనను కోరారు. వారి సమస్యలు విన్న చైర్మన్ రుద్రకోటి సదాశివం తానీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.