శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురంకు చెందిన మాజీ ఎంపీటీసీ లావణ్య తన భర్త పవన్‌కుమార్ అలియాస్ బిట్టుతో కలసి వైఎస్సార్సీపీలో చేరారు. గత ప్రభుత్వంలో ఎంపీటీసీగా గెలిచిన ఆమె కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీలోకి వెళ్లారు. టీడీపీలోకి వెళ్లిన తరువాత ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యవహారశైలిని వ్యతిరేకించారు. గత పది రోజుల క్రితం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పవన్‌కుమార్ అలియాస్ బిట్టు స్వతంత్య్ర అభ్యర్థిగా జడ్పీటీసీ స్థానికి పోటీ చేశారు. తాజాగా రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి శుక్రవారం చేరుకున్న మాజీ ఎంపీటీసీ లావణ్య, బిట్టులు చెవిరెడ్డిని కలసి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తామని వెల్లడించారు. అనంతరం వారికి వైఎస్సార్సీపీ కండువా వేసిన చెవిరెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.