BREAKING
శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య .మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి! శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు! ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు.

రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక

 

శ్రీకాకుళం, నవంబర్ 14 మేజర్ న్యూస్:
నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ఆవరణలో ఉన్న జిల్లా సైన్స్ సెంటర్‌లో శనివారం 32వ జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ - 2026 పోటీలను నిర్వహించారు. ఐదు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 87 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏడు ప్రాజెక్టులు డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ. రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో టెక్కలి ఉప విద్యాశాఖాధికారి పి. విలియం, జిల్లా సైన్స్ అధికారి ఎన్. కుమారస్వామి, జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి ఎ. సంజీవరావు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు బి. సతీష్ కుమార్, వై. హేమసుందర్, ఆర్. లక్ష్మి, పి. ఇందిరామణి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు.

రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రాజెక్టుల వివరాలు:
* ఎకో స్కేల్: టి. విజయలక్ష్మి, గైడ్ టీచర్ పి. వెంకటరావు (ఏపీ మోడల్ స్కూల్, సోంపేట)
* ఎకో పవర్: ఎం. మధుశ్రీ, గైడ్ టీచర్ కె. సంతోష్ (జేఎంజే హైస్కూల్, కంచిలి)
* వాటర్ లీకేజీ డిటెక్టింగ్ సిస్టమ్: జి. ప్రవీణ్ కుమార్, గైడ్ టీచర్ వేణుగోపాలరావు (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల, కొల్లివలస, బూర్జ మండలం)
* ఫుడ్ అడల్ట్రేషన్ ఈజీ ఐడెంటిఫికేషన్ టిప్స్: పొగిరి శ్రీదేవి, గైడ్ టీచర్ డి. సురేష్ బాబు (జడ్పీహెచ్ఎస్, పెంట, జి.సిగడాం మండలం)
* టెస్ట్ అండ్ ట్రస్ట్ ఐడెంటిఫైయింగ్ కిట్ ఫర్ ఫుడ్ అడల్ట్రేషన్: జి. వర్ధిత, గైడ్ టీచర్ ఆర్. జ్యోత్స్న (జడ్పీహెచ్ఎస్, మెట్టవలస, లావేరు మండలం)
* స్మార్ట్ మస్కిటో బ్రీడింగ్ డిటెక్టర్, ఎకో ఫ్రెండ్లీ లార్వా కంట్రోల్ సిస్టమ్: ఎం. లోహిత, గైడ్ టీచర్ పి. స్వాతి (జడ్పీహెచ్ఎస్, రొంపివలస, పాతపట్నం మండలం)
* ఎకో ఫ్రెండ్లీ మైక్రో ప్లాస్టిక్ రిమూవల్ ఫ్రమ్ వాటర్: ఆర్. కాంచనప్రియ, గైడ్ టీచర్ పి. జగదీశ్వరరావు (జడ్పీహెచ్ఎస్, జర్జంగి, కోటబొమ్మాళి మండలం)