BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘

Select Suryaa Now
గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘

 

పెదపాడు, దుప్పలవలస గురుకులాల్లో తోటలను ప్రారంభించిన డీసీఓ యశోద లక్ష్మి

శ్రీకాకుళం, నవంబర్ 14 మేజర్ న్యూస్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 9 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో శనివారం ‘చైల్డ్ న్యూట్రి గార్డెన్’ (పోషకాహార తోటలు), కిచెన్ గార్డెన్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడి పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానాల నుంచి స్ఫూర్తి పొందారు. ఆ విధానాలను రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో అమలు చేయాలనే లక్ష్యంతో ‘ఫారెస్ట్ బై హార్ట్‌ఫుల్‌నెస్ ఫౌండేషన్’ సహకారంతో ప్రభుత్వం ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలలను కార్బన్ న్యూట్రల్ ప్రాంగణాలుగా తీర్చిదిద్దుతూ, విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ, బాధ్యతాయుతమైన జీవనశైలిని పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం.

జిల్లా స్థాయి వేడుకల్లో భాగంగా ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ జిల్లా సమన్వయకర్త (డీసీఓ) వై. యశోద లక్ష్మి పెదపాడులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల, దుప్పలవలసలోని బాలుర గురుకుల పాఠశాలను సందర్శించి న్యూట్రి గార్డెన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటిస్తూ.. ఈ తోటల ద్వారా విద్యార్థులే స్వయంగా పోషక విలువలు కలిగిన తాజా కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తారని తెలిపారు. మొక్కలు నాటడం, నీటి పొదుపు, సేంద్రియ సాగు వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం లభిస్తుందన్నారు. పుస్తకాలకే పరిమితమైన పర్యావరణ విద్యను ఆచరణలోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటారని, ఈ మార్పు వారి కుటుంబాలకు, సమాజానికి విస్తరించాలని ఆమె ఆకాంక్షించారు.
క్లీనప్ డ్రైవ్‌లో జిల్లాకు గుర్తింపు:
ఇదే వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘నెట్ జీరో క్లీనప్ డ్రైవ్’లో ఉత్తమ పరిశుభ్రత ప్రమాణాలు పాటించిన శ్రీకాకుళం జిల్లాలోని పలు పాఠశాలలకు అవార్డులు లభించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కనుగుల చంద్రభాను, క్లస్టర్ కోఆర్డినేటర్లు జి. గౌతమి, బి. తేజేశ్వరి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.