విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది
మహబూబాబాద్ సూర్య ప్రతినిధి, మేజర్ న్యూస్, విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది అని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పసునూరి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ స్పర్ధయ వర్ధతే విద్య, అని చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని మాత్రం కొనుక్కోవాలనే మహానుభావుల మాటలను గుర్తు చేశారు.జీవితంలో సరైన దారి చూపించే పుస్తకాలు మాత్రమే అని అన్నారు.ప్రసార మాధ్యమాలు వేగవంతంగా సమాచారాన్ని క్షణకాలంలో అందిస్తున్నప్పటికీ, మానవుని మేధో వికాసానికి పుస్తకమే పునాది అని అంటూ, చిన్నతనం నుంచి పిల్లలలో పుస్తక పఠనం అలవాటు పెంపొందిస్తే వారు కేవలం పరీక్షలో మార్కులు సాధించే విద్యార్థులుగా కాకుండా ప్రశ్నించే, ఆలోచించే, సృజనాత్మకంగా స్పందించే పౌరులుగా ఎదుగుతారు అని అంటూ పుస్తక పఠన సంస్కృతి పెరిగితేనే విజ్ఞాన సమాజ నిర్మితమవుతుంది, విజ్ఞాన సమాజమే దేశాభివృద్ధికి నిజమైన పునాది కాబట్టి ప్రపంచాన్ని మార్చే శక్తి పుస్తకానికి మాత్రమే ఉందని, మంచి వ్యక్తిత్వం ,మంచి సమాజం పుస్తకాల ద్వారానే ఏర్పడుతుందని అన్నారు. కావున పుస్తక పఠనానికి గ్రంథాలయాలే పునాదులు అని అన్నారు.ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్లు జి. విజేందర్,రుద్రారపు వీరేందర్, సిబ్బంది బొడ్డుపల్లి భూలక్ష్మి, బి. యాదమ్మ గ్రంథాలయ పాఠకులు హరిలాల్, ఆర్ సి. విజ్ఞాన్, అనూప్ సూరజ్, మౌనిక ,కవిత, సరిత పుస్తక ప్రియులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; శ్రీనివాస్ ,మహబూబాబాద్, మహబూబాబాద్ జిల్లా