BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి

Select Suryaa Now
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి

హనుమకొండ టౌన్, మేజర్ న్యూస్, రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన బియ్యం, నిత్యావసర సరుకుల ధరలను ప్రభుత్వం తక్షణమే అదుపు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ  సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన హనుమకొండ జిల్లా సిపిఐ శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సమావేశానికి నెడినూరి రాజమౌళి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరల వల్ల పేద ప్రజల బతుకు భారంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బియ్యం ధరల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని కోరారు.
బియ్యం తదితర నిత్యవసర వస్తువులను అక్రమంగా నిలువ చేసిన వ్యాపారస్తులపై పిడి ఆక్ట్ పెట్టి అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. బియ్యం ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న హనుమకొండ జిల్లా వ్యాప్తంగా తహసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టనున్నట్లు సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి తెలిపారు.ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు పప్పులు, వంట నూనె, చక్కెర తదితర అన్ని రకాల నిత్యావసర సరుకులను సబ్సిడీపై సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అధరి శ్రీనివాస్,జిల్లా సహాయ కార్యదర్శి మధేల యెల్లేష్ వివిధ మండలాల మరియు పట్టణ శాఖ కార్యదర్శులు,అశోక్ స్టాలిన్,మాలోతు శంకర్,బత్తిని సదానందం,దుప్పటి సాంబయ్య,కొట్టిపాక రవి,జక్కు రాజు గౌడ్,వేల్పుల సారంగపాణి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్ :రమేష్, హనుమకొండ, హనుమకొండ జిల్లా