బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి
చిట్యాల, నవంబర్ 15 మేజర్ న్యూస్: భూపాల్ పల్లి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రంలో ఎన్నుకున్నారు. బాల్ బ్యాట్మెంటన్ స్టేట్ అబ్సర్వర్ తిరుపతి, ఒలింపిక్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అజిద్ ఖాన్ ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భూపాలపల్లి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షులుగా మండలంలోని నైన్ పాక గ్రామానికి చెందిన గూట్ల తిరుపతి, ఉపాధ్యక్షులుగా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఈర్ల స్వామి, మోత్కుపల్లి బుచ్చిరెడ్డి, వెంకట్రామ్ రెడ్డి , ఎండి అమ్జెద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గా జి సాంబయ్య, జిల్లా జాయింట్ సెక్రటరీ కంచర్ల కుమారస్వామి, శంకర్, కొలిపాక కిషన్, కోశాధికారిగా రవీందర్, కమిటీ సభ్యులుగా చిరంజీవి, కంచర్ల సతీష్, రాజు, మ్యాదరి కృష్ణ, నక్క రవిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ కమిటీ సభ్యులు, భూపాలపల్లి జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;సదానందం, చిట్యాల ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా