BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు

Select Suryaa Now
విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు

 

 

రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట మండలం విప్పమనుపట్టెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరుతూ గ్రామానికి చెందిన వేమాపురం మునిరత్నం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, రేణిగుంట ఎంపీడీవో, రిటర్నింగ్ అధికారికి పోస్ట్ ద్వారా తెలిపారు. కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన సమయంలో తప్పుడు, ఆధారంలేని కారణాలు చూపించి ప్రత్యర్థుల నామినేషన్లు తిరస్కరింపజేసి ఏకగ్రీవంగా గెలుస్తామని ప్రచారం చేస్తున్నట్లు తన ఫిర్యాదులో ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. అర్హులైన అభ్యర్థులందరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించి, గ్రామ ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.