ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో
మండలంలో తొలి రోజు ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణ
ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి ... ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే అప్పలనాయుడు.
సీతానగరం, నవంబర్ 16, మేజర్ న్యూస్:రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మేరకు మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభ మైంది.ఈనేపథ్యంలో ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని మండలం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే అప్పలనాయుడు తెలిపారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం ఎల్ ఎన్ ప్రసాద్. డిపిఓ ఆర్ రాజేంద్ర. డిప్యూటీ ఎంపీడీవో కేకే వర్మ తో కలిసి మండలంలోని ఏర్పాటు చేసిన 9 నామినేషన్ కేంద్రాలను ఆదివారం నాడు పరిశీలించారు.నామినేషన్ కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మరియు ప్రతిపాద కులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా అధికారులు చేసిన ఏర్పాట్లను ఎంపీడీవో స్వయంగా తనిఖీ చేశారు. తాగునీరు, నీడ వసతి, సహాయ కేంద్రాల (హెల్ప్ డెస్క్) పనితీరును అడిగి తెలుసుకున్నారు.నామినేషన్ పత్రాల స్వీకరణ, రసీదుల జారీ ప్రక్రియ పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఎంపీడీవో నడిమింటి సూర్యనారా యణ సూచించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలు విష యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండా లని సిబ్బందికి పేర్కొన్నారు.నామినేషన్ కేంద్రం పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో అభ్యర్థులు, వారి అనుచరులు గుంపులుగా చేరకుండా చూడాలని స్పష్టం చేశారు.అభ్యర్థితోపాటు నిబంధనల ప్రకారం అనుమతించిన వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతించాలని తెలియజేశారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినే షన్లను స్వీకరించడం జరుగుతుందన్నా రు.18న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుం దని పేర్కొన్నారు.ఈపరిశీల నలో డిప్యూటీ ఎంపీడీవో కేకే వర్మ , గ్రామ పంచాయతీ కార్యదర్శులు .ఎన్నికల సిబ్బంది తో పాటు తదితరులు పాల్గొ న్నారు.