ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం
మంగపేట, మేజర్ న్యూస్, కొత్తగూడెంలో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తూ ఇటీవల సివిల్ ఎస్ఐగా పదోన్నతి పొందిన పగిడిపెళ్లి ఓం ప్రకాష్ ని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ & యూత్ ఆధ్వర్యంలో మంగపేటలో ఘనంగా సన్మానించారు. త్వరలో భూపాలపల్లిలో బాధ్యతలు చేపట్టనున్న ఆయనకు ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, సభ్యులు శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి బండపల్లి రవి గౌడ్ , ప్రచార కార్యదర్శులు మహమ్మద్ కాజా , గగ్గురి మహేష్, కార్యదర్శి పుణ్ణం భాస్కర్ , ట్రస్ట్ గౌరవ సభ్యులు గార్లపాటి రాంబాబు, వనమాల సతీష్ , ములకల శ్రీను, చల్లా రాంకీ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;స్నేహ కుమార్, మంగపేట, ములుగు జిల్లా