దశదిన కర్మ కు హాజరైన సర్పంచ్.. బండి స్వామి
మల్హర్, మేజర్ న్యూస్, మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన ఊదరి రమేష్ తండ్రి ఊదరి కిష్టయ్య ఇటివల మృతి చెందగ ఆదివారం దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిచర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి హాజరై కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు ఆకుల సది, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.
రిపోర్టర్: ప్రభాకర్, మలహర్ ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా