BREAKING
ఎనుమాముల మార్కెట్ యధాతధంగా కొనసాగుతుంది దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ 39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ

Select Suryaa Now
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ

ఖానాపూర్, మేజర్ న్యూస్, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఖానాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 505 మందికి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఇందులో 287 వితంతువులకు, ఒంటరి మహిళలకు 75,కల్లుగీత కార్మికులకు  39, దివ్యాంగులకు 104,కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 4900 పెన్షన్లు మంజూరు చేసినట్లు, పరిశీలన దశలో మరో 400 ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో అద్వైత, ఎం ఆర్ ఓ,ఖానాపూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ హరిబాబు, ఖానాపూర్ పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్: అనిల్ కుమార్ ,కానాపురం, వరంగల్ జిల్లా