ఎనుమాముల మార్కెట్ యధాతధంగా కొనసాగుతుంది
వరంగల్ సిటీ, మేజర్ న్యూస్, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించిన సమస్యలపై జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,మార్కెటింగ్ అధికారులు మార్కెట్ పాలకవర్గం, రైతు సంఘాల ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎనుమాముల మార్కెట్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మార్కెట్‌కు వచ్చే రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ కార్యకలాపాలు సజావుగా కొనసాగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సమీక్ష సమావేశం లో మార్కెట్ కమిటీ చైర్మెన్ పులి ప్రియాంక,
డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రసిడెంట్ రవీందర్ రెడ్డి,
సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్; సంతోష్ ,వరంగల్ సిటీ ,వరంగల్ జిల్లా