చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, ప్రతినిధి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ** సోమవారం (నవంబర్ 16) సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు ప్రాంతాల్లో నిర్వహించే చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.మంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.30 గంటలకు సంగారెడ్డి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, 11 గంటలకు అందోల్ మండలం సంగుపేటలోని లక్ష్మీదేవి గార్డెన్స్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు సంగుపేట నుంచి బయలుదేరి, 3 గంటలకు పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్‌లోని పీఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌కు చేరుకొని అక్కడ నిర్వహించే చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.మంత్రి పర్యటన నేపథ్యంలో అవసరమైన వసతి, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు, భద్రత, ఎస్కార్ట్, బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రి పర్యటనకు సంబంధించిన తదుపరి కార్యక్రమాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.