BREAKING
ఎనుమాముల మార్కెట్ యధాతధంగా కొనసాగుతుంది దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ 39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి

Select Suryaa Now
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి

కాజీపేట, మేజర్ న్యూస్, కాజీపేటలో ప్రారంభానికి సిద్ధమవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌)లో స్థానిక నిరుద్యోగ యువతకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ రైల్వే జేఏసీ డిమాండ్ చేసింది. భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలతో పాటు రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన నిరుద్యోగులకు, ఉమ్మడి వరంగల్ జిల్లా, కాజీపేట పరిసర ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ఆదివారం కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్‌లో తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశానికి చైర్మన్ కొండ్ర నర్సింగరావు అధ్యక్షత వహించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో డిసెంబర్ నెలలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు అర్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జేఏసీ నాయకులు కోరారు. అదేవిధంగా ప్రస్తుతం రైల్వేలో ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందికి డిప్యూటేషన్ పద్ధతిలో కాకుండా ఆప్షన్ విధానం ద్వారా కాజీపేట ఆర్.యు.ఎమ్ లో పనిచేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జనవరి నుంచి కాజీపేట ఆర్.యు.ఎమ్ లో రైల్వే కోచ్‌ల తయారీకి అవసరమైన ఏర్పాట్లను రైల్వే అధికారులు చేపడుతున్న నేపథ్యంలో తమ ప్రధాన డిమాండ్లను ఇప్పటి నుంచే పరిగణనలోకి తీసుకోవాలని జేఏసీ స్పష్టం చేసింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, రైల్వే అధికారులపై ఉందని పేర్కొంది.ఈ సందర్భంగా రైల్వే జేఏసీ ముఖ్య సలహాదారు ఆచార్య కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఒకరు భూములు ఇచ్చారని, మరొకరు కోచ్ ఫ్యాక్టరీని తీసుకొచ్చామని చెబుతున్నారని, మరి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఎవరికి ఇప్పిస్తారని ప్రశ్నించారు. భూములు ఇచ్చిన వారికి, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేసిన వారికి, ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత లేదా అని నిలదీశారు. తెలంగాణ రైల్వే జేఏసీ ఉద్యమాలు చేపట్టినప్పుడే ఈ సమస్య రాజకీయ నాయకులకు, సంబంధిత వర్గాలకు గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. స్థానిక నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
*అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలి* 
సీపీఐ నాయకులు నేదునూరి రాజమౌళి మాట్లాడుతూ.. కాజీపేట ఆర్.యు.ఎమ్ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎంసీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి హంసారెడ్డి మాట్లాడుతూ.. రైల్వే జేఏసీ చేపట్టే ప్రతి పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ.. భూ నిర్వాసితులు, అక్కడి కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన న్యాయం జరగడం లేదని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా రైల్వే జేఏసీ చేపట్టే ఉద్యమాల్లో తాము కూడా భాగస్వాములమవుతామని తెలిపారు. కాజీపేట రైల్వే ఆర్.యు.ఎమ్ లో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలనే ప్రధాన డిమాండ్‌ను రైల్వే అధికారులు, కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంచు రాజేందర్, రైల్వే ఓబీసీ సికింద్రాబాద్ డివిజనల్ కార్యదర్శి ఏ. సంతోష్ కుమార్, వస్కుల రవీందర్, రైల్వే యాక్ట్ అప్రెంటిస్ యువజన నాయకుడు ప్రవీణ్, టీ. రాజశేఖర్, ఈ. సతీష్, ఎండీ. అల్తాఫ్ పాషా, వంశీకృష్ణ, బి. సాయి చరణ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జాతీయ అధ్యక్షుడు కొమ్ముల బాబు, జేఏసీ నాయకులు వి. తిరుపతి, డి. రవీందర్, కె. సాయిరాజ్, మెరుగు రాజయ్య, రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గుర్రపు సుధాకర్ రావు, సభ్యుడు వి. నాగేష్, రైల్వే ఓబీసీ సీడబ్ల్యూసీ బెల్లంకొండ రమేష్, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ పనికల శ్రీనివాస్, డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ శ్రవణ్, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు మర్రి మహేష్, సీఐటీయూ నాయకుడు కారు ఉపేందర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి, సీపీఐ సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, అయోధ్యపురం భూ నిర్వాసితులు ఇలాసాగరం ప్రదీప్, జి. నరేందర్, రాజేష్, రవికిరణ్, ఈ. వీరన్న తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; గిరి ప్రసాద్ ,కాజీపేట, హనుమకొండ జిల్లా